ఏపీ లో పదో తరగతి అర్హతతో ఆ బ్యాంకులో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక.. రాత పరీక్ష లేదు

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 01:07 PM
 

ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. Fincare Small Finance Bankలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. మొత్తం 100 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 100 ఖాళీల్లో కడప జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 25, కర్నూల్ జిల్లాలో 40 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 14లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో త


విద్యార్హతల వివరాలు..


Loan Divestment/Collection Agents విభాగాల్లో ఈ ఈ పోస్టులు కలవు. 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన వారికి ఉచితంగా వసతి సదుపాయం కల్పించనున్నారు. నెలకు రూ. 11,500 వరకు వేతనం చెల్లించనున్నారు. దీంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకనే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. అయితే ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఇతర సందేహాలుంటే 9912867909, 9553202509, 9581670585 నంబర్లను సంప్రదించాలని సూచించారు