ఏపీకి చేరుకున్న మరో 3.60లక్షల కొవిడ్ టీకా డోసులు

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 12:32 PM
 

ఏపీ రాష్ట్రానికి మరో 3.60 లక్షల కొవిడ్ టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 30 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలి వచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‎ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్తాయి. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలుగుతుంది.