కడప రిమ్స్ ఆస్పత్రిలో భారీ చోరీ

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 13, 2021, 12:22 PM
 

కడప జిల్లా రిమ్స్ ఆస్పత్రి ఆడిటోరియంలో భారీ చోరీ జరిగింది. రూ. కోటి విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. కరోనా పేరుతో ఏడాది నుంచి ఆడిటోరియం ఓపెన్ చేయకపోవడంతో అధికారులు సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రిమ్స్ ఆడిటోరియంకు చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.