ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమె వయస్సు పాతికేళ్లు.. ఆస్తి లక్షా 81వేల కోట్లు..!

international |  Suryaa Desk  | Published : Fri, Jun 11, 2021, 11:54 AM

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకడు. ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో చాలాకాలం నుంచి ఉన్న బిల్ గేట్స్.. ఇటీవల 27ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకారు. అయితే ఇదే రోజు బిల్ గేట్స్ పెట్టుబడి సంస్థ 1.8 బిలియన్ డాలర్ల "రూ.13 వేల కోట్లకుపైగా" విలువైన స్టాక్స్‌ను భార్య మెలిండాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇదే రోజు దంపతులిద్దరూ విడాకులు తీసుకోగా.. ఈ సమయంలోనే వారి పిల్లలు గురించి కూడా చర్చకు వచ్చింది.


బిల్ గేట్స్, మెలిండా గేట్స్ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె జెన్నిఫర్ కేథరీన్ గేట్స్ (25) కాగా.. చిన్న కుమార్తె ఫోబ్ అడిలె గేట్స్ (18), వీరిద్దరి మధ్యలో కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు రోరే జాన్ గేట్స్ వయస్సు 22ఏళ్లు. బిల్ గేట్స్ కుమార్తె జెన్నిఫర్ కేథరీన్ గేట్స్ గురించి చాలాకాలంగా మీడియాలో చర్చ జరుగుతోంది. జెన్నిఫర్ కొన్నిసార్లు ఆమె అందం కారణంగా మరికొన్నిసార్లు ఇతర కారణాల వల్ల మీడియాలో వినిపిస్తుంది.


ఇప్పుడు మరోసారి ఆమె పేరిట ఉన్న ఆస్తి కారణంగా ఆమె గురించి చర్చ జరుగుతోంది. జెన్నీఫర్‌ గేట్స్‌ వయసు పాతికేళ్లే కాగా.. ఆమె పేరిట ఉన్న ఆస్తి మాత్రం 25 బిలియన్‌ డాలర్లట. అంటే మన భారతీయ కరెన్సీలో లక్షా 82 వేల కోట్ల రూపాయలు. ఇంత చిన్నవయసులో ఇంత పెద్ద మొత్తంలో నికర ఆస్తులు ఉన్న వ్యక్తి ఆమెనే. జెన్నీఫర్‌ సియాటెల్‌లోని లేక్‌సైడ్‌ హైస్కూల్లో చదువుకుని, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో మావన జీవశాస్త్రం "హ్యూమన్‌ బయాలజీ" సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆమె త్వరలో నాయల్‌ నాజర్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నారు. నాయల్‌ నాజర్‌, జెన్నీఫర్‌.. ఇద్దరూ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com