లక్షల్లో కట్నం.. పైగా ఎన్నారై సంబంధం.. తొలి రాత్రే ఊహించని షాక్

  Written by : Suryaa Desk Updated: Fri, Jun 11, 2021, 11:43 AM
 

లక్షల్లో కట్నం.. పైగా ఎన్నారై సంబంధం.. కోటి ఆశలతో అత్తింట అడుగుపెట్టిన యువతికి పెళ్లయిన తొలిరాత్రే చేదు అనుభవం ఎదురైంది. తాను సంసారానికి పనికిరానంటూ భర్తే స్వయంగా చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులకు చెప్పుకుని బోరున విలపించి పుట్టింటికి చేరుకుంది. అయినా అత్తింటి నుంచి వేధింపులు ఎదురవుతుండడంతో తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


తెనాలి పాండురంగ పేటకు చెందిన ఎండీ జలాలుద్దీన్, కౌసర్ జాన్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలకు మంచి సంబంధాలు చూసి వివాహాలు చేశారు. మూడో కుమార్తెకు విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ఖాజాఖాన్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 4న పెళ్లి జరిపించారు. వివాహం తర్వాత కెనడాలో ఉద్యోగం కోసం వెళతానని చెప్పడంతో ఎన్నారై సంబంధం దొరికిందన్న సంతోషంతో కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లయిన తొలిరాత్రే భర్త చెప్పిన మాటలు విన్న ఆ యువతి ఒక్కసారిగా ఖంగుతింది.