గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నిరసన

  Written by : Suryaa Desk Updated: Fri, Jun 11, 2021, 11:25 AM
 

గుంటూరు మార్కెట్ సెంటర్‌లో పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనకు దిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయిల్ ధరలు నియంత్రణ చేయలేని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.