విశాఖపట్నంలో దారుణం..ఆత్మస్థైర్యం కోల్పోయిన బాధితుడు

  Written by : Suryaa Desk Updated: Thu, Jun 03, 2021, 11:16 AM
 

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని విమ్స్ ఆస్పత్రి పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం విషయంలో ఆత్మస్థైర్యం కోల్పోయిన మురిపాల వీరబాబు  "37 " అనే వ్యక్తి ఆస్పత్రి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు భీమునిపట్నం గొల్లపాలెంకు చెందినవాడినగా గుర్తించారు. అయితే వీరుబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆత్మ స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. కాగా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో అధికారుల్లో కలవరం మొదలైంది.