ఆన్‌లైన్‌లో ఆనందయ్య ఆయుర్వేద మందు..

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 01, 2021, 03:19 PM
 

ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే, కంట్లో వేసే చుక్కల మందు తప్ప.. మిగతా వాటికి పర్మిషన్ ఇచ్చింది. అయితే మరో గూడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. అంతకుముందు ఆనందయ్యతో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు సమావేశం అయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చక్రధర్‌బాబు వివరించారు. కరోనా పాజిటివ్ రోగులకిచ్చే మందు పంపిణీకి మొదట ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.