ఏపీలో కరోనా బీభత్సం... 24 గంటల్లో రాష్ట్రంలో 118 మంది మృతి

  Written by : Suryaa Desk Updated: Sat, May 22, 2021, 09:19 PM
 

ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత కొన్నిరోజుల మాదిరే, గడచిన 24 గంటల్లో వందకు పైగా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో 118 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటింది. తాజా మరణాలతో కలిపి 10,022గా నమోదైంది. 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,683 మందికి చికిత్స కొనసాగుతోంది.