విశాఖ కేజీహెచ్ సీఎస్ఆర్ కోవిడ్ బ్లాక్‌లో ఎంత ఘోరం..!

  Written by : Suryaa Desk Updated: Thu, May 13, 2021, 04:20 PM
 

విశాఖ కేజీహెచ్ సీఎస్ఆర్ కోవిడ్ బ్లాక్‌లో దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్‌తో చనిపోయిన మృతదేహాల నుంచి ఆభరణాలు, వస్తువులు మాయమవుతున్నాయి. అడిగితే.. తమకు తెలియదని హెల్ప్ డెస్క్ సిబ్బంది చెబుతుండటం గమనార్హం. గత కొన్ని రోజులుగా వందల మంది ఫిర్యాదు చేశారని, ఉన్నతాధికారులు కూడా తెలియజేశామని... తామేం చేయలేమని సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రశ్నించిన వారిని పోలీసులు వెళ్లగొడుతున్నారు బాధితులు వాపోతున్నారు.