కరోనాపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

  Written by : Suryaa Desk Updated: Thu, May 13, 2021, 03:31 PM
 

రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మరోసారి కరోనా పై  కీలక వ్యాఖ్యలు చేసారు కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఇబ్బందిపెడుతోందన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం నెలకు ఏడు కోట్లు మాత్రమే ఉందన్నారు. దేశం మొత్తంలో రెండు కంపెనీలే కోవిడ్‌ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం చేస్తూ..జాగ్రత్తలు పాటిస్తూ.. యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సీఎం జగన్ సూచించారు. మరోవైపు 'వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకం' కింద నేడు మొదటి విడతగా రూ.7500 చొప్పున రైతుల ఖాతాల్లో సీఎం జగన్ లాంఛనంగా విడుదల చేయనున్నారు. తొలివిడతగా రూ4,003 కోట్లను రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు చేరాయి. లబ్ధిదారుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు.