రాష్ట్రంలో తీసుకునే చర్యలు దేశానికే ఆదర్శం : ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్

  Written by : Suryaa Desk Updated: Thu, May 13, 2021, 02:51 PM
 

శ్రీకాకుళం : కోవిడ్ 2వ దశ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై జిల్లా కలక్టర్ కార్యాలయంలో సమీక్ష.  కలెక్టర్ నివాస్ ఆధ్వర్యంలో  జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్. హాజరైన మంత్రి సీదిరి అప్పల రాజు, ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, శ్రీరాముల నాయుడు,  ఐటిడిఏ పీవో శ్రీధర్, డిఎహెచ్ఓ చంద్ర నాయక్, ఆర్డీవోలు, తదితరులు. ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ కలవరపాటుకు గురిచేస్తున్న కోవిడ్ రెండో దశలో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం సర్వ శక్తులూ ఒడ్డుతుంటే ఇందులోనూ రాజకీయాలు చేసే వారుండటం సిగ్గు చేటు. విపత్తును ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో తీసుకునే చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.  అందుబాటులో వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ బాధితులకు వైద్య, ఇతర సేవలు అందేలా చూడాలని, విపత్తును ఎదుర్కోవడమనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలపై ఆలోచిస్తూ బాధితుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  ప్రజాప్రతినిధులు అందించే విలువైన సూచనలను స్వీకరించి, అమలుచేసేందుకు కృషి చేయాలి.  కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉన్నవారికి సరైన కౌన్సెలింగ్ ఇచ్చి, బాధితుల్లో ధైర్యం నింపి మహమ్మారి నుంచి బయటపడేలా చూడాలి. మీడియా సంయమనం పాటించాలి. మంత్రి డాక్టర్ సీదిరి మాట్లాడుతూ  యంత్రాంగం చాలా కష్టపడుతోంది. వైద్యం సరిగా లేదు అనే ఫిర్యాదు ఒక్కటి కూడా వుండరాదు. బ్యాక్ అప్ జనరేటర్స్ సిద్ధం చేసుకోవాలి. ట్రేసింగ్, టెస్టింగ్ ఆలస్యం కాకూడదు.