కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు

  Written by : Suryaa Desk Updated: Thu, May 13, 2021, 12:32 PM
 

కరోనా కాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీ ప్రభుత్వంలోని 8 శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి జగన్ సర్కార్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


మరోవైపు 'వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకం' కింద నేడు మొదటి విడతగా రూ.7500 చొప్పున రైతుల ఖాతాల్లో సీఎం జగన్ లాంఛనంగా విడుదల చేయనున్నారు. తొలివిడతగా రూ4,003 కోట్లను రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు చేరాయి. లబ్ధిదారుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు.