రైతుల ఖాతాల్లోకి భరోసా..

  Written by : Suryaa Desk Updated: Thu, May 13, 2021, 12:10 PM
 

శ్రీకాకుళం : రైతన్నకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోన్న ఏపీ ప్రభుత్వం..  ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే మూడో ఏడాది కూడా 'వైఎస్సాఆర్‌ రైతు భరోసా' తొలి విడత సాయం విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి డెప్యూటీ సీఎం ధర్మాన కష్ణదాస్ హాజరయ్యారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అగ్రిమిషన్ కమిటీ సభ్యులు గోండు రఘురామ్, కళింగ  కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, జేడీ అగ్రికల్చర్ కే.రాబర్ట్ పాల్, పలాస మున్సిపల్ ఛైర్మెన్ బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.