నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు

  Written by : Suryaa Desk Updated: Wed, May 05, 2021, 08:12 AM
 

ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీసీలకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, సర్వీసుల్లో వెనుకబడిన కులాల(ఏ,బీ,సీ,డీ, ఈ)కు రిజర్వేషన్లను మరో పదేళ్లకు పొడిగిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి అయిదేళ్ల సడలింపు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి 2031 మే 31 వరకు వీటిని వర్తింపజేస్తామని ప్రభుత్వం పేర్కొంది.