కరోనాతో బలహీనమైన బంధాలు

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 05:43 PM
 

కరోనా దెబ్బకు బంధాలన్నీ బలహీనం అయిపోయాయి కరోనాతో చనిపోతే నా అనుకున్న వాళ్లే మొహం చాటేస్తున్నారు. మా ప్రాణాలు ఎక్కడ పోతాయో అని ప్రాణభీతితో ఆ చుట్టుపక్కల ఉండేందుకు కూడా జంకుతున్నారు.. కానీ ప్రకాశం జిల్లా కొమరోలులో అనారోగ్య సమస్యలతో మృతిచెందిన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడుకి స్నేహితులు అండగా నిలిచారు. స్మశానానికి తీసుకు వెళ్లి అంతక్రియలు పూర్తిచేసేందుకు ఆ నలుగురే బంధువులయ్యారు.


కొమరోలు మండలానికి చెందిన గాదం శెట్టి గుప్తా పలు ప్రైవేట్ పాఠశాలలో 15 సంవత్సరాలకు పైగా పని చేశాడు. నాలుగు రోజుల క్రితం గుప్తాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ఆరోగ్యం క్షీణించి అకస్మాత్తుగా మృతి చెందాడు. చుట్టుపక్కల వాళ్ళు అయిన వాళ్లు అందరూ కరోనాతోనే చనిపోయి ఉంటాడని అనుమానంతో మృతుడి ఇంటి వైపు కూడా కన్నెత్తి చూసేందుకు సాహసించలేదు. కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు చిల్లిగవ్వ లేక వృద్ధ తల్లిదండ్రులు మృతుడి భార్య చనిపోయిన ప్రైవేట్ ఉపాధ్యాయుని మృతదేహంతో ఇంటిలోనే కొన్ని గంటలుగా నిరీక్షించారు


ఈ విషయం స్థానికంగా ఉన్న మిత్రులందరికీ తెలిసింది మేమున్నామంటూ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ముందుకు వచ్చారు..


వైసిపి నాయకులు మాజీ ఎంపీటీసీ షేక్ మౌలాలి విలేజ్ సెక్రటరీలు రమణ సుబ్బారావు జర్నలిస్ట్ కృష్ణారెడ్డి తాన్సేన్ చనిపోయినా ప్రైవేట్ ఉపాధ్యాయుడుకి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ముందుకు వచ్చారు పి పి కిట్లు ధరించి మృతదేహాన్ని అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ప్రైవేట్ ఉపాధ్యాయుడు గుప్త మృతదేహాన్ని స్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.


అంతేకాదు పలువురు దాతల ద్వారా కొంత నగదు సేకరించి ఆర్థికంగా చితికిపోయిన గుత్తా కుటుంబానికి అండగా నిలిచారు కరోనా కారణంగా మానవత విలువలు కనుమరుగైపోతున్న తరుణంలో స్నేహితులు మాత్రం మానవతా దృక్పథంతో వ్యవహరించి అంత్యక్రియలు పూర్తి చేయటాన్ని పలువురు వారిని అభినందిస్తున్నారు.