ఈ నెల 13న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 05:20 PM
 

మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 13న రైతు భరోసా తొలి విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ పథకం ద్వారా 54 లక్షల మందికి లబ్ధిచేకూరుతుందని ఆయన అన్నారు. మే 25న 38లక్షల మంది రైతుల ఖాతాల్లో నష్ట పరిహారం కింద రూ.2,805 కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద మే 18న ప్రతి కుటుంబానికి రూ.10వేలు పరిహారం అందజేస్తామన్నారు.