ఎస్​బీఐ ఖాతాదారులకు గుడ్ ​న్యూస్

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 04:55 PM
 

ఎస్​బీఐ తన ఖాతాదారులకు మరో గుడ్​ న్యూస్ చెప్పింది. ఇటీవల గృహ రుణాలపై అందించే వడ్డీ రేటును తగ్గించిన ఎస్బీఐ ఇప్పుడు మరో శుభవార్త అందించింది. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేవైసీ అప్​ డేట్ కోసం పత్రాలను మెయిల్ లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చని ఎస్​బీఐ తెలిపింది. అంతేకాకుండా కేవైసీ అప్ ​డేట్ గడువును మే 31 వరకు పొడిగించింది.