జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 04:16 PM
 

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా పరీక్షలన్నీ వాయిదా పడుతున్నాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 24 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. తదుపరి పరీక్షల షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది.