కడుపు నొప్పికి తాళలేక వివాహిత ఆత్మహత్య

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 27, 2021, 05:48 PM
 

తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట పట్టణ ప్రాంతమైన గణపతినగరం దుర్గమ్మ గుడి సమీపాన నివసిస్తున్న అక్కిరెడ్డిబేబీరానీ(28)అనే వివాహిత మహిళ కడువునోప్పికి తాళలేక పురుగుల మందు సేవించి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కి ఎనిమిది సంవత్సరాల క్రితం విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గోపాల పట్నం గ్రామానికి చెందిన. వ్యక్తితో వివాహం అయినప్పటికీ. సంతానం. కలగలేదు. ఇటీవలే బేబీరానీ పుట్టిల్లు అయిన. సామర్లకోటకు చేరుకుంది. సోమవారం కడుపునొప్పి ఎక్కువకావడం తో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలిసిన వెంటనే. సామర్లకోట పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సామర్లకోట ఎస్ఐ వీఎల్వీకే సమంత కేసు నమోదు చేసి దర్యాప్తు. చేస్తున్నట్లు చెప్పారు.