మనిషి మాంసం తినే వింత చేపలు!

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 15, 2021, 12:03 PM
 

తూర్పుగోదావరి జిల్లాలో మనిషి మాంసం తినే చేపలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పి.గన్నవరం మండలం మానేపల్లిలోని పంట కాల్వలో వింత చారలు ఉన్న చేపలు దొరికాయి. ఈ చేపలను సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటారని తెలుస్తోంది. ఇవి పశ్చిమ బంగ్లా నుంచి ఫిష్ సీడ్​లో ఆంధ్రకు తరలి వచ్చాయి. నలుపు చారలు కలిగిన ఆ చేపలు చూడడానికి భయంకరంగా ఉన్నాయి. ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ నదిలో ఎక్కువగా ఈ చేపలుంటాయి. నదులు,చెరువుల్లో కనిపిస్తే ఈ చేపలను చంపేస్తారు. ఎందుకంటే ఇవి పర్యావరణాన్ని నాశనం చేస్తాయి. ఇవి మనుషుల మాంసాన్ని కూడా తింటాయని అధికారులు తెలిపారు. ఈ చేపల నోరు ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి సుమారు 50 అంగుళాల పొడవు కలిగి ఉంటాయి. ఇవి ఇతర చేపల్లాంటివి కావు.