ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాసలీలలు ఘటనలో ఇద్దరు మంత్రులు ఔట్!

international |  Suryaa Desk  | Published : Tue, Mar 30, 2021, 03:27 PM

ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రాసలీలల ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యవహారం అక్కడి అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్ ఉద్యోగుల రాసలీల వ్యవహారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండటంతో డిఫెన్స్ లో పడింది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్షణ శాఖ మంత్రి లిండా రేనాల్డ్స్‌, అటార్నీ జనరల్‌ క్రిస్టియన్‌ పోర్టల్‌పై వేటు వేస్తూ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఆవరణంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల పట్ల ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com