విద్యాసంస్థల్లో కరోనా కలకలం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 22, 2021, 01:24 PM
 

తూర్పు గోదావరి జిల్లాలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయటపడ్డాయి. సోమవారం రాజమండ్రి రూరల్ మండలం కాతేరులోని తిరుమల విద్యాసంస్థల్లో 56 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విద్యార్థులందరూ ఇంటర్ చదువుతున్నారు. దీంతో మరో 400 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు కోసం యాజమాన్యం, తల్లితండ్రులు ఎదురు చూస్తున్నారు. కరోనా రావడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.