ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా

national |  Suryaa Desk  | Published : Mon, Mar 15, 2021, 12:23 PM

ఈపీఎఫ్ సంస్థ 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నగదు నిల్వ, వడ్డీలు, పన్ను మినహాయింపు, పింఛన్ లాంటి పలు రకాల సౌకర్యాలను అందిస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 2019-20 ఏడాదికి గానూ ఈపీఎఫ్‌వో 8.5 శాతం వడ్డీని అందించింది. ఈపీఎఫ్ ఖాతాదారులు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల ఈ కింది పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


- ముందుగా ఈపీఎఫ్‌వో అధికారిక ఈపీఎఫ్ వెబ్‌ సైట్ లో యూఏఎన్ యూజర్ నేమ్, పాస్‌ వర్డ్‌ తో లాగిన్ అవ్వాలి.
- మేనేజ్ సెక్షన్ కు వెళ్లి అందులో ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ ఖాతా లాంటి కేవైసీ వివరాలు వెరిఫై చేసుకోవాలి.
- ఆన్ ‌లైన్ సర్వీసెస్ కు వెళ్లి అందులో క్లెయిమ్(ఫార్మ్- 31, 19, 10సీ) ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఈపీఎఫ్ ఖాతాదారుడి వివరాలు కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతాలోని చివరి 4 అంకెలు నమోదు చేయాలి.
- ఇప్పుడు వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- అనంతరం మీ వివరాలు మొత్తం నమోదు పూర్తయ్యాక ఎస్ ఆప్షన్ ఓకే చేయాలి.
- అనంతరం ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై I want to Apply For అప్షన్ మీద క్లిక్ చేయాలి.
- లోన్ తీసుకోవడానికి గల కారణాలు, ఎంత నగదు విత్‌ డ్రా చేసుకోవాలని భావిస్తున్నారో తెలియజేయాలి.
- మొత్తం ప్రక్రియ పూర్తైన తర్వాత Employer ఆమోదం తెలిపితే అనంతరం 15 నుంచి 20 రోజుల్లోగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌ కు నగదు జమ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com