ఒక్క ఓటుతో విజయం..

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 15, 2021, 11:56 AM
 

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 14 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 6 వార్డులు గెలిచింది. కాగా, 17వ వార్డులో వైసీపీ అభ్యర్థి బొంతు సత్యశ్రీనివాస్‌.. జనసేన పార్టీ అభ్యర్థి జక్కంశెట్టి బాలకృష్ణపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.


ఒక్క ఓటుతో కౌన్సిలర్‌ పదవి..


తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీలో 5వ వార్డు కౌన్సిలర్‌ గా వైసీపీ అభ్యర్థి బొజ్జా రామయ్య ఒక్క ఓటుతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు మాత్రమే ఎక్కువ సాధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య రీకౌంటింగ్‌ నిర్వహించిన అధికారులు చివరకు ఒక్క ఓటు మెజారిటీతో రామయ్య గెలిచినట్టు ప్రకటించారు.