విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం..

  Written by : Suryaa Desk Updated: Sun, Mar 14, 2021, 01:04 PM
 

విజయవాడలో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం సాధించారు. విజయవాడలోని 11వ డివిడిజన్ నుంచి టీడీపీ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్వేత.. కౌంటింగ్ ప్రారంభంలో కాస్త వెనుకంజలో ఉన్నారు. ఆ తరువాత రౌండ్లలో ఓట్లు పెరగడంతో విజయం సాధించారు. ఇక విజయవాడ మేయర్‌ సీటు కోసం టీడీపీలో చాలా మందే పోటీ పడ్డారు. శ్వేతతో పాటు పలువురు పేర్లు తెర మీదకు వచ్చినప్పటికీ.. చివరగా.. టీడీపీ అధిష్టానం మాత్రం కేశినేని నాని కూతురు శ్వేత పేరునే ప్రకటించింది.


ఇదిలాఎంటు,, రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన బెజవాడలో బల్దియా పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. కౌన్ బనేగా బెజవాడ మేయర్? ఈ ప్రశ్న రాజకీయ రాజధాని నలుమూలలా వినిపిస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఇవే చర్చలు నడుస్తున్నాయి. విజయవాడ కార్పొరేషన్‌లో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. టిడిపి నుంచి మేయర్ అభ్యర్థిగా పోటీకి దిగిన ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ఇప్పటికే గెలుపొందారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారంగా టీడీపీ ఐదు, వైసీపీ ఐదు డివిజన్లలో విజయం సాధించింది. ప్రస్తుతం టీడీపీ 13, 45, 46 డివిజన్లలో ముందంజలో ఉండగా.. వైసీపీ 23, 27, 31, 47, 53, 34, 15 డివిజన్లలో ముందంజలో ఉంది.ఫలితాల వెలుడిన తరువాత విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియను ఈనెల 18వ తేదీన నిర్వహిస్తారు.