ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాకీతో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..యువతి ఇంటి దగ్గర రచ్చ రచ్చ

national |  Suryaa Desk  | Published : Fri, Feb 19, 2021, 02:31 PM

ప్రేమించిన యువతి తనను కాదన్నదని ఓ వ్యక్తి తుపాకీతో హల్ చల్ చేశాడు. యువతి ఇంటికి వెళ్లి షర్ట్ విప్పేసి నానా రచ్చ రచ్చ చేశాడు. యువతిని తనతో పంపకుంటే అందరినీ కాల్చిచంపుతానని ఆమె కుటుంబ సభ్యులను హెచ్చరిస్తూ వీరంగం వేశాడు. తన ప్రేమ వన్‌సైడ్‌ లవ్‌గా మారడం ఆమె తనకు దక్కదని తేలడంతో తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోతానని బెదిరించాడు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫోన్‌ చేయడంతో అక్కడికి వచ్చిన ఖాకీలనూ తుపాకీతో బెదిరిస్తూ వారిని ముప్పతిప్పలు పెట్టాడు.
రాజస్థాన్‌లోని ధోల్పూర్‌లో జరిగిన ఈ ఘటనలో ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ఆకాష్‌ గుర్జార్‌గా గుర్తించారు. గతంలో యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్ధం కాగా అప్పట్లో ఆమెను ఆకాష్‌ కిడ్నాప్‌ చేశాడని ఆరోపణలున్నాయి. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారని ధోల్పూర్‌ ఎస్పీ కేసర్‌ సింగ్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com