అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న జగన్

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 19, 2021, 02:02 PM
 

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న జగన్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం కొత్తగా తయారు చేసిన రథాన్ని జగన్ ప్రారంభించారు. ఈనెల 28 వరకు స్వామివారి కల్యాణోత్సవాలు జరుగనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 5న రథం దగ్ధమైన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని దుండగులు రథాన్ని తగలబెట్టారు. ఈ నేపథ్యంలో రూ. 95 లక్షల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథాన్ని తయారు చేయించింది. రథాన్ని ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.