ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్ళికి వెరైటీ గిఫ్ట్.. అందరూ షాక్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 19, 2021, 01:48 PM

కొందరు యువకులు తమ స్నేహితుడి పెళ్లికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని భావించారు. కాస్త విలువైన గిఫ్ట్ నే ఇవ్వాలని డిసైడయ్యారు. బాగా ఆలోచించి ఓ వినూత్న బహుమతిని పెళ్లి మండపంలోనే ఆ కొత్త జంటకు అందించారు. ఆ గిఫ్ట్ ని చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా షాకయ్యారు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నైకి చెందిన కార్తీక్, శరణ్య వివాహ వేడుక గురువారం రాత్రి జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన కార్తీక్ స్నేహితులు అతడికి ఇచ్చే పెళ్లి కానుక గురించి వెరైటీగా ఆలోచించారు. వినూత్నంగా ఆలోచించి పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి కదా.. అని ఓ గ్యాస్ బండను, 5 లీటర్ల పెట్రోల్ క్యాన్ ను బహుమతిగా ఇచ్చారు. ఉల్లిపాయలతో చేసిన దండను కూడా వధూవరులకు ఇచ్చారు. వారు వాటిని పరస్పరం మార్చుకున్నారు. ఆ యువకులు ఇచ్చిన గిఫ్ట్ ను చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా అవాక్కయ్యారు. ఉల్లిపాయ దండలను మార్చుకోవడం చూసి అంతా తెగ నవ్వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com