ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఐదింటితో అన్ని రోగాలు పరార్!

national |  Suryaa Desk  | Published : Thu, Nov 26, 2020, 05:30 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయం పట్టుకుంది. పలు ప్రాంతాల్లో కొత్త కేసులు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ చలికాలంలో వైరస్ మరింత విజృంభిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం. ఈ ఐదు పదార్థాలను తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అవేంటో చూద్దాం. పసుపు పాలు: పసుపు పాలు చక్కని ఔషధం. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. పసుపు పాలను తీసుకుంటే జలుబు వంటి సమస్యలు దరిచేరువు. ఉసిరికాయ: ఉసిరికాయను కొందరు నేరుగా తింటే.. మరికొందరు జూస్ చేసుకొని తాగుతారు. ఉసిరిని ఎలా తిన్న ఆరోగ్యానికి మంచిదే. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శీతాకాలంలో ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యి: నెయ్యి తక్షణం శక్తిని అందిస్తుంది. చలికాలంలో క్రమం తప్పకుండా ఆహారంలో నెయ్యి తీసుకుంటే ఎంతో మంచిది. బెల్లం: బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెల్లం తినడం వల్ల చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలు దరిచేరవు. నువ్వులు: శీతాకాలంలో నువ్వులు తింటే శరీరానికి లోపలి నుంచి వేడి అందుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ ఐదు పదార్థాలను తింటే శీతాకాలంలో కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com