ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఏపీ హోంమంత్రి సుచరిత

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 02:26 PM
 

నివర్ తుఫాన్‌ తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి సుచరిత సూచించారు. విపత్తు నిర్వహణ, పోలీసు అధికారులను అలర్ట్ గా ఉండాలని, తీరప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు జిల్లాలలో వర్షాలు పడుతున్నాయని హోంమంత్రి కి అధికారులు తెలిపారు. కాగా, ఏపీలోని చిత్తూరులో నివర్ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. మల్లిమడుగు వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. తిరుపతి రేణిగుంట దగ్గర కుమ్మరలోపు చెరువుకు వరద ఉద్ధృతి పెరిగింది. రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరుచేరింది.