మంగళగిరిలో ఈదురు గాలుల భీభత్సం

  Written by : Suryaa Desk Updated: Thu, Nov 26, 2020, 01:16 PM
 

మంగళగిరి పట్టణంలో నీవర్ తుఫాన్ ఈదురు గాలుల భీభత్సం సృష్టిస్తున్నాయి. ఉదయం నుండే చలిగాలులు, ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సందర్బంలో పట్టణంలోని కోర్టు ప్రాంగణంలోని కొబ్బరి చెట్టు ఈదురుగాలులకు నెలవారింది. దీంతో సమీపంలోని కరెంటు వైర్లపై పడడంతో సమీపంలోని విద్యుత్తు స్థంబం కొంతమేర ద్వంసమైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపివేసి, సహాయక చర్యలను చేపట్టారు.