ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కోసం ఉంచిన నగదు, బంగారం అగ్గిపాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 24, 2020, 12:55 PM

షార్ట్‌ సర్క్యూట్‌ తో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు కాలిపోయాయి. కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసిన నగదు, బంగారం కూడా కాలిపోయాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం హంస కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో వారాడ కృష్ణమూర్తి, బొడ్డు గోపాల్‌ కు చెందిన ఇళ్లు కాలిపోయాయి. షార్ట్‌ సర్క్యూట్‌ తో జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణమూర్తికి చెందిన రూ. 9.20 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఆభరణాలు కాలిబూడిదైనట్లు అగ్నిమాపక అధికారి ఐవీ రామయ్య తెలిపారు. కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసిన నగదు, బంగారంతో పాటు టీవీ, విలువైన వస్తువులు కాలిపోవడంతో కృష్ణమూర్తి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com