జగన్ పై విమర్శలు చేసిన అచ్చెన్నాయుడు

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 22, 2020, 01:55 PM
 

అభద్రతతోనే పోలవరం సందర్శనకు అడ్డంకులు ఎదురయ్యాయని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌రెడ్డినిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలైందన్నారు. ప్రజల తిరుగుబాటుతో జగన్ పతనం మొదలైందన్నారు. సీపీఐ, సీపీఎం నేతల హౌస్‌ అరెస్ట్‌ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అక్రమ అరెస్టులన్నారు. పోలవరాన్ని జగన్‌రెడ్డి సుడిగుండంలో నెట్టేశారని మండిపడ్డారు.