ప్రభుత్వ తీరుపై మండిపడ్డ అనగాని సత్యప్రసాద్

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 22, 2020, 12:04 PM
 

టిడ్కో ఇళ్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లబ్ధిదారులు రోడ్డెక్కితే తప్ప టిడ్కో ఇళ్లు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు కడతామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఇళ్ల విషయంలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఇష్టానుసారం హామీలు ఇచ్చి ప్లేట్ ఫిరాయిస్తామంటే ఊరుకునేది లేదని అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.