పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 28, 2020, 01:59 PM
 

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన జరిగింది.. ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. బుధవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం బూదేవిపేట గ్రామానికి చెందిన పలువురు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీశారు.. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టగా మరో ఇద్దరు డెడ్‌బాడీలు తీశారు. మరో ఇద్దరు ఆచూకీ తెలియాల్సి ఉంది.