రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 28, 2020, 12:13 PM
 

ఏపీ  డిజిపి గౌతమ్ సవాంగ్ IPS గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా  ఎస్పీల పర్యవేక్షణలో ఉదయం నుండి కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్. రాష్ట్ర వ్యాప్తంగా   ఆపరేషన్ ముస్కాన్ కు  ప్రత్యేక పోలీసు  రెస్య్కూ టీమ్ లను ఏర్పాటు చేసిన  జిల్లా ఎస్పీలు. రాష్ట్ర వ్యాప్తంగా   బాలకార్మికుల వ్యస్థ  నిర్మూలనకు శ్రీకారం చుట్టిన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్


కోవిడ్ 19 నిబంధనలు, జాగ్రత్తలను పాటిస్తూ వీధి, అనాథ,  తప్పి పోయిన ,  పారిపోయి వచ్చిన  బాలలను గరిష్ట సంఖ్యలో రక్షించే  లక్ష్యంతో ICDS, చైల్డ్ వేల్పేర్ కమిటిలతో సమన్వయం తో కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్. రాష్ట్ర వ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, హోటల్స్ ,  పరిశ్రమలు, దుకాణాలు , రద్దీ ప్రాంతాలలో జల్లడ పడుతున్న పోలీసులు. హైదరాబాద్ కిడ్నాపర్లకు ఆపరేషన్ ముస్కాన్ తో అనంతపురం పోలీసుల చెక్.  ఆపరేషన్ ముస్కాన్ వాహన తనిఖిలతో డెంటిస్ట్ హుస్సేన్ ను కిడ్నాపర్ల నుంచి రక్షించిన అనంతపురం జిల్లా పోలీసులు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో నిన్న సాయంత్రం కిడ్నాప్ కు గురైన దంత వైద్యుడు హుస్సేన్