పంచాయతీ కార్యదర్శి ఇలియాస్ బేగ్ సస్పెన్షన్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 28, 2020, 12:00 PM
 

పింఛన్ల చెల్లింపులో అక్రమాలకు పాల్పడ్డ వ్యవహారం పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. లింగపాలెం మండలం  ధర్మాజిగూడెం పంచాయతీ కార్యదర్శి ఇలియాస్ బేగ్ సస్పెన్షన్‌కు గురైంది. స్థానిక నాయకుల ఒత్తిడితో ముగ్గురు వాలంటీర్ల బదిలీ, అనధికారికంగా పెట్టిన వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, పింఛన్ల చెల్లింపులో అక్రమాల ఆరోపణలతో ఇలియాస్ బేగ్‌పై సస్పెన్షన్ వేటుపడింది.