ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు మీరు ప్రేమించుకోండి సార్ తప్పులేదు, కానీ పబ్లిక్ లో : రఘురామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 23, 2020, 03:49 PM

ఇటీవల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తన ప్రసంగంలో డీజీపీని ఉద్దేశించి 'సవాంగ్ అన్నా' అని సంబోధించారు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. "నిన్న సీఎం జగన్ గారి అద్భుత వాక్ ప్రవాహంలో భాగంగా డీజీపీని 'గౌతమ్ సవాంగ్ అన్నా' అని సంబోధించారు. మీరు మీరు ప్రేమించుకోండి సార్ తప్పులేదు, కానీ పబ్లిక్ లో 'అన్నా' అని పిలవడం బాగాలేదు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా!" అని హితవు పలికారు. చాటుగా ప్రేమించుకుంటే ప్రేమించుకున్నారు కానీ ఇలా బహిరంగంగా అన్నా, తమ్ముడూ అనుకోవద్దని సూచించారు.


అంతేకాకుండా, రాజధానిలో ఉద్యమం చేస్తున్న మహిళలను ఉద్దేశించి ఇటీవల జరుగుతున్న ప్రచారంపైనా రఘురామకృష్ణరాజు స్పందించారు. వారు ధరించే చీరలు, జాకెట్లు మీద కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. దుందుడుకుతనంతో మహిళలను అవమానపర్చడం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అని అన్నారు. రాజధాని మహిళలపై తమ పార్టీకి చెందినవారు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తనకు తెలుసని, అయితే ఆ వ్యాఖ్యలు చేసిన వారు తమ పార్టీకి చెందినవారు కాకపోయినా వారిని క్షమించి వదిలేయాలని రాజధాని మహిళలను కోరుతున్నట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com