ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2020: చెన్నై- ముంభై సమరంలో గెలుపెవరిది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 23, 2020, 01:21 PM

ఐపీఎల్ 13 లో భాగంగా నేడు షార్జా లో చెన్నై, ముంభై జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మొత్తం 29 మ్యాచులు జరగ్గా, చెన్నై 12, ముంబై 17 మ్యాచ్ ల్లో గెలిచింది. ఇక తాజాగా షార్జా లో జరుగనున్న మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. మరి ఇరు జట్ల బలాబలాలు విశేషాలు తెలుసుకుందాం పదండి.


ఆచి తూచి అడుగులు


రాజస్థాన్ తో ఆడిన ఆడిన గత మ్యాచ్ లో ఓటమిపాలై చెన్నై జట్టులో నిరాసక్తత ఆవహించింది. ఓపెనర్‌ మురళీ విజరు స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. షేన్‌ వాట్సన్, అంబటి రాయుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. డుప్లెసిస్‌, రవీంద్ర జడేజా, శామ్‌ కరన్‌ సహా కేదార్‌ జాదవ్‌, ఎం.ఎస్‌ ధోనీలు మంచి ఫామ్‌లో ఉన్నారు. లుంగి ఎంగిడి, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లాలతో బౌలింగ్‌ విభాగం మెరుగ్గా కనిపిస్తోంది. అయితే, ఆట వ్యూహాల్లో మరింత పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది.


మిడిలార్డర్‌ బలంగానే..


పంజాబ్ తో ఆడిన ఆఖరి మ్యాచ్ లో అపజయం పాలైన ముంబై జట్టుకు ఈసారి ఎలాగైనా విజయాన్ని అందించాలని కెప్టెన్ రోహిత్ శర్మ కృత నిశ్చయంతో ఉన్నాడు. రోహిత్, క్వింటన్ డికాక్‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌‌ పటిష్టంగా ఉంది. వీరి బ్యాటింగ్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, కీరన్ పొలార్డ్‌లతో మిడిలార్డర్‌ కూడా బలంగా ఉంది. అయితే, బ్యాటింగ్‌లో బలంగా ఉన్న ముంబై.. బౌలింగ్‌లో మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెట్టే అంశం. బుమ్రాపైనే పూర్తిగా పేస్ భారం పడనుంది.


తుది జట్లు (అంచనా)


చెన్నై సూపర్ కింగ్స్‌ :


షేన్‌ వాట్సన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, శామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లా, లుంగి ఎంగిడి.


ముంబై ఇండియన్స్:


రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ , సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా


టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : చెన్నై సూపర్‌కింగ్స్‌
కెప్టెన్: ఎంఎస్ ధోని
యజమాని: చెన్నై సూపర్‌కింగ్స్‌ క్రికెట్ లిమిటెడ్
విజేత : 2010, 2011, 2018
రన్నరప్ : 2008, 2012, 2013, 2015, 2019


టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : ముంబై ఇండియన్స్
కెప్టెన్: రోహిత్ శర్మ
యజమాని: ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్
విజేత : 2013, 2015, 2017, 2019
రన్నరప్ : 2010






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com