రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భేటీ...

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 23, 2020, 11:24 AM
 

రాష్ట్రంలో మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై చర్చించేందుకు ఈ నెల 28న వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పారీ్టల నుంచి అభిప్రాయాలను సేకరించాక తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.