వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు..

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 23, 2020, 11:10 AM
 

వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు అయిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెనుమురు మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో కొండయ్య గారి పల్లి వద్ద వాగుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. అర్ధరాత్రి సమయంలో కారులో వస్తున్న ఓ కుటుంబం వాగులో చిక్కుకొంది. ఆ సమయంలో చుట్టు పక్కల ఎవ్వరు లేకపోవడంతో కారులో ఉన్న ప్రతాప్ అనే వ్యక్తి తోపాటు అతని కుమార్తె  సాయి వినూత వరద  ప్రవాహంలో కొట్టుక పోయారు. కారులోనే ఉండిన మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. గల్లంతు అయిన వారు పుటలపట్టు వాసులు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరోవైపు గల్లంతు అయినవారి కోసం రెస్క్యూ టీమ్‌ గాలింపు చర్యలు చేపట్టింది.