ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్.. ఈఎస్‌ఐలో 39 జాబ్స్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 22, 2020, 03:59 PM

గుల్బర్గాలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న 39 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎంసీఐ నియమనిబంధనల ప్రకారం విద్యార్హతలు, ఇతర అర్హతలు ఉన్నవాళ్లే ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీస్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి.
మొత్తం ఖాళీలు- 39
అసోసియేట్ ప్రొఫెసర్- 12
అసిస్టెంట్ ప్రొఫెసర్- 27
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది: అక్టోబర్ 23, 2020
విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు: గరిష్టంగా 69 ఏళ్లు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల‌కు నెలకు రూ.92,000, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,06,000 ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు అక్టోబర్ 23న నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. రిజిస్ట్రేషన్స్ ఉదయం 9 గంటలకు మొదలై 11 గంటలకు ముగుస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com