విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 22, 2020, 08:43 AM
 

విశాఖ: ఎయిర్‌పోర్ట్‌లో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికుడిని ఆదాయపన్ను శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో నగదు అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. రూ.13 లక్షల నగదును గుర్తించారు. ప్రయాణికుడి వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు సేకరిస్తున్నారు