ఈరోజు పంచాంగం

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 20, 2020, 08:53 AM
 

ఈరోజు పంచాంగం ఈరోజు మంగళవారం  20 అక్టోబర్, 2020  శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం  నిజ ఆశ్వయుజ మాసం  శుక్లపక్షం | చవితి సా.04-40 వరకు తదుపరి పంచమి అనూరాధ నక్షత్రం ఉ.09-37 వరకు తదుపరి జేష్ఠ వర్జ్యం: మ.02-55 నుంచి 04-25 వరకు  అమృత ఘడియలు మ.12-01 నుంచి 01-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి రా. 10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35


మేషం: దూరపు బంధువులను కలుస్తారు. ఇంటాబయటా అనుకూలం. ఉపయుక్త సమాచారం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో మరింత సానుకూలత. విందువినోదాలు.. 


వృషభం: బంధువుల నుంచి ఒత్తిళ్లు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.


మిథునం: శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలలో ఆశాజనకం. ఉద్యోగాలలో పదోన్నతులు. 


కర్కాటకం: శ్రమించినా ఫలితం ఉండదు. కొన్ని పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరిగి రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం..


 


సింహం: చిన్ననాటి మిత్రుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన ఉద్యోగాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.


 కన్య: మిత్రులతో వివాదాలు కొంత తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారం. శుభవార్తలు వింటారు.


తుల: పనులు కొన్ని హఠాత్తుగా నిలిపివేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు ∙నిరాశ కలిగిస్తాయి. 


వృశ్చికం: పనుల్లో ప్రతిష్ఠంభన. కొత్తగా రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.


ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. బంధువుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. 


మకరం: రుణాలు తీరుస్తారు. వ్యవహారాలలో మరింత పురోగతి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు.. 


కుంభం: కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. విచిత్రమైన సంఘటనలు. బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. 


మీనం: ముఖ్య నిర్ణయాలు వాయిదా. పను లు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. కళాకారుల యత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన.