వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు : విజయసాయిరెడ్డి

  Written by : Suryaa Desk Updated: Sun, Oct 18, 2020, 04:38 PM
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఆరోగ్యశ్రీ పథకం, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ధి పొందిన ప్రజలే ఆయన ముందు చూపునకు మచ్చుతునక అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడారు. ఈ పథకం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఆసరా లభించిందని ట్వీట్ చేశారు.


‘గత పది నెలల్లో 134 కోట్ల వ్యయంతో 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయలో అండ. డిశ్చార్జైన  48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు. కుటుంబ పెద్ద కోలుకునే సమయంలో పెద్దదిక్కుగా మారిందీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. జగన్ గారి ముందు చూపునకు మచ్చుతునక’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.