గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 16, 2020, 10:15 AM
 

గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. నార్కట్‌పల్లి-మేదరమెట్ల రహదారిలో రొంపిచర్ల-సుబ్బయ్యపాలెం మధ్య కారు అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్‌ కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందారు. మృతులను తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి వాసులుగా గుర్తించారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.