జీజీహెచ్ కు మంత్రి శ్రీరంగనాథ రాజు కోటి రూపాయలు విరాళం

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 16, 2020, 09:44 AM
 

గుంటూరు.రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు గురువారం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి అభివృద్ధి కోసం కోటి రూపాయలు వ్యక్తిగత విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి వస్తున్న పేద ప్రజలకు గుంటూరు జీజీహెచ్ సేవలందిస్తున్న దని మంత్రి పేర్కొన్నారు. కొవిడ్ చికిత్సల్లో నూ జీజీహెచ్ కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. ఇకనుంచి జీజీహెచ్ లో చికిత్స పిందే రోగి తోపాటు వెంట వచ్చే సహాయకునికి సైతం రెండుపూటలా భోజన వసతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం తాను వ్యక్తిగతంగా కోటి రూపాయలు ఇస్తున్నానని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆసుపత్రిలో అసంపూర్తిగా వున్న నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రోగులకు చికిత్సకు అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టినట్టు ఆయన వివరించారు. కొవిడ్ రోగులకు అవసరమైన పడకలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, జిల్లా కలెక్టర్ శామ్యూల్.ఆనండకుమార్, సంయుక్త కలెక్టర్ ప్రశాంతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తదితరులున్నారు.