అనంతపురంలో విషాదం.. తండ్రి చేతిలో ఇద్దరు చిన్నారులు హతం

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 15, 2020, 12:28 PM
 

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని తండ్రి చేతిలో ఇద్దరు చిన్నారులు ( కవల పిల్లలు) దారుణంగా హత్యకు గురయ్యారు. ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో వారి గొంతునులిమి చంపేశాడు. 


బోయిలపల్లికి చెందిన రాధమ్మ, రవి లకు ఇద్దరు కొడుకులు. వారిరువురు కవలలు. కాగా, బుధవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో సుదీప్,(5) సుధీర్ (5) ల గొంతు నులిమి హత్య చేశాడు ఆ కసాయి తండ్రి. అనంతరం ఇద్దరు కొడుకులను తీసుకెళ్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. అక్కడే వారిని పూడ్చి పెట్టాడు.పిల్లలు కనిపించకపోయే సరికి రాధమ్మ భోరున విలపిస్తూ.. నా బిడ్డలను ఏంచేశావని రవిని నిలదీసింది. దీంతో అతడు అసలు విషయాన్ని చెప్పాడు. అయితే రవికి కొంతకాలంగా మానసిక స్థితి ఏమీ భాగోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఫారెస్ట్ లోకి వెళ్లి పూడ్చి పెట్టిన ఇద్దరు చిన్నారులను వెలికి తీయించారు. అనంతరం  ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు కిరాతక  తండ్రిని అరెస్టు చేశారు