టీవీ నటి సుచిత్ర పోలీసులకు లొంగిపోయింది...

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 15, 2020, 09:16 AM
 

సొంత ఇంట్లో చోరీ చేసి నాటకమాడిన బుల్లితెర నటి సుచిత్ర మంగళవారం పోలీసుస్టేషన్‌లో హాజరైంది.  బన్రూట్టి సమీపంలోగల మాలిగైమేడు గ్రామానికి చెందిన దేసింగు (55). ఇతను సెప్టెంబర్‌ 12న ఇంటికి తాళం వేసి భార్య పచ్చయమ్మాల్, కుమారుడు మణికంఠన్‌తో బయటికి వెళ్లారు. దేసింగు ఇంటికి తిరిగిరాగా బీరువాలో ఉన్న 18 సవర్ల నగలు, నగదు చోరీకి గురయ్యాయి. పోలీసుల విచారణలో తన ఇంట్లో మణికంఠన్‌ చోరీ చేసిన విషయం తెలిసింది. మణికంఠన్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో భార్య సుచిత్ర బుల్లితెర నటి అని, ఆమె సొంతగా సీరియల్‌ తీసేందుకు నగదు అవసరమైందని, దీంతో తాను, సుచిత్ర నగలు, నగదు  చోరీ నాటకమాడినట్లు తెలిపారు.